జాతీయ అవార్డు అందుకున్న ధర్మవరం చేనేత కళాకారుడు

సత్యసాయి: ధర్మవరం పట్టణానికి చెందిన చేనేత డిజైనర్ జూజురు నాగరాజు ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్, ఎంపీ కంగనా రనౌత్ చేతుల మీదుగా జాతీయ చేనేత డిజైన్ డెవలప్‌మెంట్ అవార్డు అందుకున్నారు. ఈ గుర్తింపు సంతోషంగా ఉందని, భవిష్యత్తులో చేనేతలో నూతన డిజైన్లు రూపొందించేందుకు కృషి చేస్తానని ఆయన తెలిపారు.