ప్రారంభమైన మత్స్యకార సహకార సంఘం ఎన్నికలు
VZM: బొబ్బిలిలో మంగళవారం మత్స్యకార పారిశ్రామిక సహకార సంఘం ఎన్నికలు ప్రారంభం అయ్యాయి. ఈ మేరకు బొబ్బిలి సొసైటీలో 484మంది, పాతబొబ్బిలిలో 187 మంది, కలవరాయిలో 70 మంది ఓటర్లు ఉన్నారు. బొబ్బిలి సొసైటీకు మార్కెట్ యార్డు, పాతబొబ్బిలి, కలవరాయి సొసైటీకు కలవరాయిలో ఎన్నికలు ప్రారంభం అయ్యాయి. ఓటుహక్కును వినియోగించుకునేందుకు మత్స్యకారులు క్యూ కట్టారు.