ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో అడ్మిషన్లు ప్రారంభం

ELR: నూజివీడులోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో 2025-26 విద్యా సంవత్సరానికి ఖాళీగా ఉన్న ట్రేడ్లలో అడ్మిషన్లకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ రజిత బుధవారం తెలిపారు. ఆసక్తి కలిగిన వారు ఈనెల 21వ తేదీ నుంచి 26వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ అవకాశాన్ని అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె అన్నారు.