పెద్దపల్లికి రూ. 62.23 కోట్లు మంజూరు
PDPL: అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ ద్వారా పెద్దపల్లి అభివృద్ధికి రూ. 62.23 కోట్లు మంజూరయ్యాయి. ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు కృషితోనే ఈ నిధులు సాధ్యమయ్యాయని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా వారు బాణసంచా కాల్చి, మిఠాయిలు పంచుకుని సంబరాలు చేసుకున్నారు. విజయరమణ రావు మాటల మనిషి కాదు, చేతల మనిషి అని వారు కొనియాడారు.