పెరుగుతున్న ఎండలు.. నిర్మానుష్యంగా వీధులు

పెరుగుతున్న ఎండలు.. నిర్మానుష్యంగా వీధులు

JN: జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. గత కొద్దిరోజులుగా ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతుండటంతో జిల్లా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తుండటంతో మధ్యాహ్నం 12 గంటలకే వీధులన్నీ నిర్మానుష్యంగా తలపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అవసరం అయితే తప్ప మధ్యాహ్న సమయాల్లో బయటకి రావోద్దని హెచ్చరించారు.