రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి: ఎంవీఐ

రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి: ఎంవీఐ

MHBD: దంతాలపల్లి మండల కేంద్రంలో ప్రైవేటు స్కూల్ వాహనాలపై అధికారులు ఇవ్వాళ తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంవీఐ వెంకట్ రెడ్డి డ్రైవర్లకు రోడ్డు భద్రతా నియమాలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం నివారించాలని హెచ్చరించారు. వాహన పత్రాలు ఎల్లప్పుడూ వెంట ఉంచుకోవాలని తెలిపారు. తనిఖీల్లో ఎస్సై పి. రాజు పాల్గొన్నారు.