వైభవంగా భాగిర్తమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు

వైభవంగా భాగిర్తమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు

కోనసీమ: అయినవిల్లి మండలం క్రాప శంకరాయగూడెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీగంగా భాగిర్తమ్మ తల్లి అమ్మవారి జాతర మహోత్సవాలు శనివారం వైభవంగా జరిగాయి. అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయం వద్ద ఏర్పాటుచేసిన కోలాట ప్రదర్శన భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. చిన్నారులు చేసిన కోలాట నృత్యాలకు భక్తులు మంత్రముగ్ధులయ్యారు.