ప్రాథమిక వ్యవసాయ సహకార గోడౌన్ల తనిఖీ

HNK: కాజీపేట మండలం దర్గా కాజీపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం గోడౌన్లను జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రవీందర్ సింగ్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. గోడౌన్లలో నిల్వ ఉన్న యూరియా బస్తాలను తనిఖీ చేయడంతో పాటు రికార్డులను పరిశీలించి సిబ్బందికి తగు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి సంతోష్ సిబ్బంది పాల్గొన్నారు.