షాదిఖానాను ప్రారంభించిన ఎంపీ
కర్నూలు (M) ఈ. తాండ్రపాడులో నిర్మించిన షాదిఖానాను MP బస్తిపాటి నాగరాజు, మాజీ MP టీజీ వెంకటేష్ ప్రారంభించారు. వారు మాట్లాడుతూ.. నేడు వివాహాలు, శుభకార్యాలు ఖరీదైనవిగా మారాయన్నారు. చాలా ఏళ్లుగా షాదిఖానా లేకపోవడంతో శుభకార్యాలకు ముస్లింలు ఆర్థికంగా పడ్డరన్నారు. ప్రస్తుతం నిర్మించిన షాది ఖానా ముస్లింలకు వరంగా మారిందన్నారు. ఈ అవకాశాన్ని ముస్లింలు సామూహికంగా వినియోగించుకోవాలన్నారు.