'ఎన్నికలు పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకుంటాం'
BHPL: టేకుమట్ల మండల కేంద్రంలోని జడల్పేట గ్రామ పంచాయతీల్లో ఏర్పాటుచేసిన ఎన్నికల నామినేషన్ కేంద్రాలను ఇవాళ గ్రామ పంచాయతీ ఎన్నికల పరిశీలకులు ఫణీంద్ర రెడ్డి పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఎన్నికలు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరిగేలా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సంబంధిత అధికారులకు కీలక సూచనలు జారీ చేశారు. అధికారులు తదితరులు ఉన్నారు.