సంక్షేమ కార్యక్రమాలపై కలెక్టర్‌తో భేటీ అయిన వైరా ఎమ్మెల్యే

సంక్షేమ కార్యక్రమాలపై కలెక్టర్‌తో భేటీ అయిన వైరా ఎమ్మెల్యే

KMM: వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ జిల్లా కలెక్టర్ అనుదీప్‌ని జిల్లా కలెక్టరేట్‌లో బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. వైరా నియోజకవర్గంలో చేపట్టే పలు అభివృద్ధి పనులకు సంబంధించి ప్రతిపాదనలను ఎమ్మెల్యే కలెక్టర్‌కు అందజేశారు. అనంతరం సంక్షేమ కార్యక్రమాలపై కలెక్టర్‌తో ఎమ్మెల్యే చర్చించారు. దీనిపై జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు.