నిబంధనలు విరుద్ధంగా టపాసుల దుకాణాలు
NRML: జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో గత మూడు రోజుల నుండి దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని నియమ నిబంధనలకు విరుద్ధంగా టపాసుల దుకాణాలను ఏర్పాటు చేశారు. నిబంధనలను పట్టించుకోకుండానే సంబంధిత అధికారులు దుకాణాలు నెలకొల్పేందుకు అనుమతులు ఇవ్వడంపై జిల్లావ్యాప్తంగా ప్రజలు తీవ్ర చర్చలు జరుపుతున్నారు. అధికారులు ఇకనైనా స్పందించాలని కోరారు.