ఎమ్మిగనూరులో అన్న క్యాంటీన్ తనిఖీ

ఎమ్మిగనూరులో అన్న క్యాంటీన్ తనిఖీ

KRNL: ఎమ్మిగనూరులో మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి ఇవాళ పలు ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. ఎక్కడా సమస్యలు రాకుండా బలమైన చర్యలు తీసుకోవాలని కార్మికులకు ఆదేశించారు. శ్రీనివాస సర్కిల్‌లోని అన్న క్యాంటీన్‌ను తనిఖీ చేసి, అల్పాహారం నాణ్యతను పరిశీలించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించి, అల్పాహారంపై ఫీడ్‌బ్యాక్ స్వీకరించినట్లు తెలిపారు.