కుప్పం-పలమనేరు హైవేపై రోడ్డు ప్రమాదం

కుప్పం-పలమనేరు హైవేపై రోడ్డు ప్రమాదం

CTR: కుప్పం-పలమనేరు హైవేపై గొల్లపల్లి వద్ద బుధవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. కోయంబత్తూరు నుంచి ఢిల్లీకి టెంకాయల లోడ్‌తో వెళుతున్న లారీ స్పీడ్ బ్రేకర్ల వద్ద ముందు వెళ్తున్న ఆటోని ఢీకొట్టింది. ఆటో డ్రైవర్ తలకు గాయాలయ్యాయి. స్థానికులు అంబులెన్స్ సాయంతో పలమనేరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.