సమ సమాజ స్థాపనకై ఉద్యమించాలి: CITU
ADB: CITU వ్యవస్థాపక అధ్యక్షులు బీటీ రణధీవే స్ఫూర్తితో సమసమాజ స్థాపనకు ఉద్యమించాలని CITU జిల్లా కార్యదర్శి కిరణ్ అన్నారు. సోమవారం ఆదిలాబాద్ పట్టణంలోని CITU కార్యాలయంలో రణధీవే వర్ధంతి కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు విడనాడాలని కోరారు.