కోతుల బెడద నివారణ కోసం ఎలుగుబంటి వేషం

కోతుల బెడద నివారణ కోసం ఎలుగుబంటి వేషం

సూర్యాపేట జిల్లా పాలకీడు మండలం గుడుగుంట పాలెం గ్రామంలో కోతుల బెడద అధికంగా ఉంది. ఈ సందర్భంగా శనివారం గ్రామస్తులు ఎలుగుబంటి వేషధారణతో కూడిన డ్రెస్‌ను కొనుగోలు చేసి గ్రామపంచాయతీ కార్మికునికి వేశారు. ఎలుగుబంటి వేషంతో కాస్త కోతుల విడత తగ్గుముఖం పడుతుందని గ్రామస్తులు తెలిపారు. అతని వేషం చూసి కోతులు పరారవుతున్నాయన్నారు.