మోసాపూరిత SMSల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

NLR: వివిధ బ్యాంకుల పేర్లతో వచ్చే మోసాపూరిత SMSల విషయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని నెల్లూరు ఎస్పీ జి.కృష్ణకాంత్ సోమవారం సూచించారు. బ్యాంకుల పేర్లతో పంపిస్తున్న అప్లికేషన్లను ఇన్‌స్టాల్ చేయొద్దని సూచించారు. సైబర్ నేరగాళ్లు బ్యాంకుల పేరుతో SMSలు పంపి వలవేస్తారని అన్నారు. ప్రజలు వారి వలలో చిక్కుకోకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు.