రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు

రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు

NDL: పాణ్యం మండల పరిధిలోని తమ్మరాజుపల్లె సమీపంలో శనివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కపడ గ్రామానికి చెందిన జగదీష్ బైక్‌పై హైదరాబాదుకు బయలుదేరిన ఆయన, ఎస్ టర్నింగ్ వద్ద వాహనాన్ని అధిగమించబోయి బైక్ అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టాడు. ఈ ఘటనలో గాయపడిన జగదీష్‌ను హైవే పోలీసులు కర్నూలు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.