లాఠీఛార్జ్ వార్తలు అసత్యం: ఎస్పీ
CTR: శ్రీకాళహస్తి దేవాలయంలో మహాశివరాత్రి సందర్భంగా భక్తులపై లాఠీచార్జ్ జరిగిందంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ఖండించారు. నంది వాహన ఊరేగింపులో కొందరు మాలధారులు క్రమశిక్షణా రాహిత్యంతో వాహనాన్ని బలవంతంగా మోసే ప్రయత్నం చేయడంతో ప్రమాద పరిస్థితి తలెత్తిందన్నారు.