రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన కలెక్టర్

SDPT: జిల్లా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని కలెక్టర్ కే.హైమావతి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆసుపత్రులలో రక్తం కొరత ఉందని, ప్రతి ఒక్క యువకుడు రక్తదానం చేయాలని కోరారు. రక్తదానం చేసిన విద్యార్థులను అభినందించి, డోనర్ సర్టిఫికెట్లు అందజేశారు.