తలనీలాల సేకరణ, కొబ్బరికాయల విక్రయానికి వేలం

MBNR: చిన్న చింతకుంట మండల పరిధిలోని అమ్మపురం కురుమూర్తి స్వామి జాతరలో జరిగే వ్యాపారాలకు బుధవారం బహిరంగ వేలం నిర్వహించినట్లు ఆలయ కమిటీ ఛైర్మన్ గోవర్ధన్ రెడ్డి తెలిపారు. 2025-26 జాతర బ్రహ్మోత్సవాలలో కొబ్బరికాయల అమ్మకం, తలనీలాల సేకరణ, ఇతర పూజ సామగ్రి, లడ్డు పులిహోర విక్రయాలకు బహిరంగ వేలం నిర్వహిస్తున్నామన్నారు.