తెలంగాణ ప్రక్రియపై ఉద్దేశపూర్వకంగా దాడి: మాజీ మంత్రి
WNP: బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య తెలంగాణ ఏర్పాటును దేశ విభజనతో పోల్చడాన్ని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. రాజ్యాంగబద్ధంగా, పార్లమెంట్ ఆమోదంతో, దశాబ్దాల పోరాటం, అమరవీరుల త్యాగాల ఫలితంగా తెలంగాణ ఏర్పడిందని స్పష్టం చేశారు. అవగాహన లేకుండా మాట్లాడుతున్న బీజేపీ ఎంపీలు క్షమాపణ చెప్పాలని, ఈ వ్యాఖ్యలను ఖండించాలని నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు.