పూలే జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే
KKD: తునిలో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా స్థానిక ఎమ్మెల్యే యనమల దివ్య పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. సామాజిక సమానత్వం, మహిళా విద్య కోసం పూలే చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆయన మార్గదర్శకుడని పేర్కొన్నారు.