పేకాట శిబిరంపై దాడి.. కేసు నమోదు

పేకాట శిబిరంపై దాడి.. కేసు నమోదు

ఎన్టీఆర్: తిరువూరు మండలం వామకుంట్ల గ్రామ శివారులోని ఒక మామిడి తోటలో పేకాట శిబిరంపై పోలీసులు బుధవారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి రూ.6 వేల 890 రూపాయలు నగదు సీజ్ చేసి కేసు నమోదు చేసామని ఎస్సై వై. శాతకర్ని తెలిపారు.