'స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావాలి'
AKP: స్థానిక సంస్థల ఎన్నికలకు బీజేపీ శ్రేణులు సిద్ధం కావాలని ఎలమంచిలి మండల బీజేపీ అధ్యక్షులు కుమార్ స్వామి పిలుపునిచ్చారు. మంగళవారం ఏటికొప్పాక గ్రామంలో పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహించారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల వద్దకు తీసుకువెళ్లి వారిని చైతన్యవంతులను చేయాలని వారికి సూచించారు.