CITU రాష్ట్ర కమిటీలో మన జిల్లా నేతలు!
E.G: నంద్యాలలో జరిగిన CITU 17వ రాష్ట్ర మహాసభల్లో తూర్పుగోదావరి (D) నేతలకు రాష్ట్ర కమిటీలో చోటు దక్కింది. సభ్యులుగా ఎం.సుందర్ బాబు, బి.పవన్, టి.అరుణ్, వై.బేబీ రాణి ఎన్నికయ్యారు. ఈ వివరాలను జిల్లా ప్రధాన కార్యదర్శి బి.పవన్ బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా కార్మిక సమస్యలపై పోరాటాన్ని తీవ్రం చేస్తామని ఈ సందర్భంగా నేతలు పేర్కొన్నారు.