సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ
NRPT: మక్తల్ కాంగ్రెస్ కార్యాలయంలో మంత్రి వాకిటి శ్రీహరి 89 నిరుపేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కులను అందజేశారు. అనారోగ్య కారణాలతో ఇబ్బంది పడుతున్న వారిని ప్రభుత్వం ఆదుకుంటుందని ఆయన తెలిపారు. ఆర్థిక సాయం పొందిన బాధితులు మంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు, పలు గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.