సైబర్ నేరగాళ్ల పట్ల అవగాహన కార్యక్రమం
GDWL: సైబర్ నేరాల నుంచి రక్షణకు అవగాహనే శ్రీరామరక్ష అని గద్వాల ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. 'సైబర్ జాగ్రుత దివాస్' సందర్భంగా బుధవారం జిల్లావ్యాప్తంగా అవగాహన సదస్సులు నిర్వహించారు. ఎవరైనా మోసపోతే వెంటనే 1930 నంబర్‌కు ఫోన్ చేయాలని లేదా www.cybercrime.gov.in పోర్టల్లో ఫిర్యాదు చేయాలని సూచించారు. అపరిచిత వ్యక్తులకు ఓటీపీలు చెప్పవద్దని హెచ్చరించారు.