ముత్యాల రెడ్డినగర్‌లో 'కిల్కారి' సేవలపై అవగాహన
గుంటూరు నగరంలోని ముత్యాల రెడ్డినగర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కిల్కారి రీజినల్ ప్రోగ్రామ్ ఆఫీసర్ రాజు శనివారం సందర్శించారు. గర్భిణులు, బాలింతలకు 'కిల్కారి' పథకం ద్వారా అందే ఆరోగ్య సూచనల ప్రాధాన్యతను వివరించారు. గర్భధారణ, శిశు సంరక్షణపై సమయానుకూల సమాచారం కోసం 911600403660 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.