'విద్యార్థుల బంగారు భవిష్యత్‌కు బాసటగా నిలవాలి'

'విద్యార్థుల బంగారు భవిష్యత్‌కు బాసటగా నిలవాలి'

VZM: విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు తల్లిదండ్రులు బాసటగా నిలవాలని బొండపల్లి ఎంఈఓ ఆల్లు వెంకటరమణ కోరారు. శనివారం బొండపల్లి మండలంలోని దేవుపల్లి హైస్కూల్‌లో హెచ్ఎం బి సత్యనారాయణ పర్యవేక్షణలో మెగా తల్లిదండ్రుల సమావేశం జరిగింది. ఏఎస్ఐ గోపి మాట్లాడుతూ.. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. సర్పంచ్ జీ రమణమ్మ, ఎస్ఎంసి ఛైర్మన్ కుమారి పాల్గొన్నారు.