జీజీహెచ్ ఇన్‌ఛార్జ్ సూపరింటెండెంట్‌గా ఏడుకొండల రావు

జీజీహెచ్ ఇన్‌ఛార్జ్ సూపరింటెండెంట్‌గా ఏడుకొండల రావు

ఒంగోలు ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వై. ఏడుకొండలరావు జీజీహెచ్ ఇన్‌ఛార్జ్ సూపరింటెండెంట్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు వైద్య విద్యా శాఖ డైరెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుత సూపరింటెండెంట్ డాక్టర్ జమున కడప వైద్య కళాశాల ప్రిన్సిపల్‌గా బదిలీ అయ్యారు. బుధవారం జమున నుంచి ఏడుకొండలరావు బాధ్యతలు స్వీకరించారు.