విశాఖలో వైసీపీ కోటి సంతకాల సేకరణ
VSP: ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 'కోటి సంతకాల సేకరణ కార్యక్రమం విశాఖ ఉత్తర నియోజకవర్గంలోని 25వ వార్డులో ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమంలో వైసీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు పాల్గొన్నారు. ప్రభుత్వ వైద్య విద్య, ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను పరిరక్షించాలనే లక్ష్యంతో ఈ ఉద్యమం జరుగుతోందన్నారు.