సీసీ రోడ్డు పనులు ప్రారంభం
MDK: చేగుంట మండలం పొలంపల్లిలో సీసీ రోడ్ల నిర్మాణం పనులను సర్పంచ్ కొండి రాజ్యలక్ష్మి స్వామి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామం అభివృద్ధి లక్ష్యంగా డ్రైనేజీ, తాగునీరు, సమస్యపై ప్రత్యేక దృష్టి పెట్టి ఆదర్శంగా తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు CH. ప్రవీణ్, M. రాజు, రాపాకుల శేఖర్ గౌడ్, కొండి కలమ్మ, కర్రే స్వామి, పులిమామిడి రాజు పాల్గొన్నారు.