చెకుముకి సైన్స్ గోడ పత్రిక ఆవిష్కరణ

SKLM: విద్యార్థులలో శాస్త్రీయ పరిజ్ఞానం పట్ల ఆసక్తిని శాస్త్రీయ వైఖరిని పెంపొందించేందుకు చెకుముకి సైన్సు సంబరాలు దోహదం చేస్తాయని జనవిజ్ఞాన వేదిక యువత జిల్లా కన్వీనర్ బాడాన రాజు అన్నారు. టెక్కలి నియోజకవర్గం సంతబొమ్మాలి మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, బోరుభద్రలో చెకుముకి సైన్స్ సంబరాల గోడపత్రికను ప్రధానోపాధ్యాయులు పి.రామకృష్ణ ఆవిష్కరించారు.