'పాలియేటివ్ కేర్ సర్వీసులను వినియోగించుకోవాలి'

KMR: పట్టణ పరిధిలోని ఇస్లాంపుర యూపీహెచ్‌సీ ఆరోగ్య సిబ్బంది శుక్రవారం క్యాన్సర్ సర్వే నిర్వహించినట్లు డా. చందనప్రియ తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. క్యాన్సర్ లక్షణాలతో బాధపడుతున్న వ్యక్తులను గుర్తించేందుకు సర్వే నిర్వహించారని తెలిపారు. క్యాన్సర్ సంబంధిత మందులు వాడుతున్న వ్యక్తులు పాలియేటివ్ కేర్ సర్వీసును వినియోగించుకోవాలని అవగాహన కల్పించినట్లు పేర్కొన్నారు.