ఇందుకూరుపేటలో చోరీల పర్వం.. ఆందోళనలోప్రజలు

ఇందుకూరుపేటలో చోరీల పర్వం.. ఆందోళనలోప్రజలు

NLR: ఇందుకూరుపేట(మం)లో గత 3 నెలలుగా చోరీలు బీభత్సంగా జరుగుతున్నాయి. పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెబుతున్నా, ఇప్పటి వరకు దొంగలను పట్టుకుని బహిర్గతం చేయలేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చోరీలకు పాల్పడుతున్న వారిపై పోలీసులు ఇకనైనా దృష్టి సారించి, కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.