జిల్లాలో అథ్లెటిక్స్ పోటీలు.. జాతీయ శిక్షణకు అవకాశం

జిల్లాలో అథ్లెటిక్స్ పోటీలు.. జాతీయ శిక్షణకు అవకాశం

RR: జిల్లాలో 12-16 ఏళ్ల బాలికల కోసం ఖేలో ఇండియా ఉమెన్స్ అథ్లెటిక్స్ లీగ్ పోటీలు నిర్వహిస్తున్నారు. 60మీ, 600మీ, లాంగ్ జంప్, హై జంప్, జావెలిన్ త్రో, షాట్ పుట్ ఈవెంట్లలో పాల్గొనేందుకు ఆసక్తి గలవారు ఈ నెల 28న సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో ఉదయం 8 గంటలకు రిపోర్ట్ చేయాలి. ఇందుకు రిజిస్ట్రేషన్ ఉచితం. అర్హత సాధించిన వారికి జాతీయ స్థాయి శిక్షణకు అర్హులు.