'బాల్య వివాహాలు చేస్తే కఠిన చర్యలు'

'బాల్య వివాహాలు చేస్తే కఠిన చర్యలు'

పల్నాడు జిల్లాను బాల్య వివాహ రహిత జిల్లాగా మార్చాలని కలెక్టర్ కృతిక శుక్లా కోరారు. నరసరావుపేటలో అవగాహన బ్రోచర్‌ను ఆమె ఆవిష్కరించారు. అక్షయ తృతీయ వేళ బాల్య వివాహాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎక్కడైనా ఇలాంటి పెళ్లిళ్లు జరిగితే వెంటనే 1098 లేదా 1800-102-7222 నంబర్లకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు.