అంబేద్కర్ విగ్రహానికి భూమి పూజ చేసిన ఆర్డీవో
KDP: పొరుమామిళ్ల అంబేద్కర్ సర్కిల్లో పాత విగ్రహం స్థానంలో 13 అడుగుల అంబేద్కర్ విగ్రహం కోసం సోమవారం అంబేడ్కర్ ఆశయ సాధన కమిటీ ఆధ్వర్యంలో భూమి పూజ చేశారు. ఆర్డీవో చంద్రమోహన్ పాల్గొని, టెంకాయ కొట్టి భూమి పూజ చేశారు. అతి త్వరలో నిర్మాణం పూర్తి చేసి అంబేద్కర్ జయంతికి (ఏప్రిల్ 14) ప్రారంభిస్తామని కమిటీ కన్వీనర్ ప్రసాదరావు పేర్కొన్నారు.