నందిగామ ప్రజలకు అలర్ట్

ఎన్టీఆర్: ఎగువ ప్రాజెక్టుల నుంచి భారీ వరదలు రావడంతో పులిచింతల ప్రాజెక్టు నుంచి ప్రకాశం బ్యారేజీకి 3–5 లక్షల క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది. నందిగామ డివిజన్ పరిధిలో కృష్ణానది ఒడ్డు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పడవ ప్రయాణాలు, ఈతలు మానుకోవాలని అధికారులు సూచించారు. అత్యవసరాలకు కంట్రోల్ రూమ్ నంబర్: 7893053534 సంప్రదించాలని సూచించారు.