రాజకీయాల్లోకి వచ్చాకే బీపీ, షుగర్ వచ్చాయి: రోజా
AP: రాజకీయాలపై మాజీ మంత్రి ఆర్కే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయం చేయడం అనేది ఆషామాషీ కాదని అన్నారు. రాజకీయాల్లోకి వచ్చాకే తనకు బీపీ, షుగర్ వచ్చాయన్నారు. మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు బీపీ వచ్చిందని.. రెండోసారి ఎమ్మెల్యే అయినప్పుడు షుగర్ వచ్చిందని చెప్పారు.