ప్యాకేజీ-2లో రూ.587 కోట్లతో 38 రిజర్వాయర్లు..!

MDCL: ORR ప్రాజెక్ట్ ప్యాకేజీ-2లో భాగంగా 38 కొత్త సర్వీస్ రిజర్వాయర్లు, 1250 కి.మీ పైప్‌లైన్ నెట్‌వర్క్ నిర్మాణం చేపడుతున్నారు. దీని ఖర్చు రూ.587 కోట్లు. ఈ ప్రాజెక్టు పరిధిలో రాజేంద్రనగర్, శామీర్‌పేట్, మేడ్చల్, కుత్బుల్లాపూర్, పటాన్ చెరు, ఆర్సీపురం, బొల్లారం వంటి ఐదు మండలాలు ఉన్నాయి. మొత్తం 1.96 లక్షల మందికి నీరు అందుతుందని జలమండలి మంగళవారం తెలిపింది.