VIDEO: వీధి దీపాలు ఏర్పాటు చేయాలని వినతి
KMR: బిక్కనూర్ మండల కేంద్రంలోని రేణుక ఎల్లమ్మ ఆలయం సమీపంలో వీధి దీపాలు ఏర్పాటు చేయాలని టీజీవీపీ ఆధ్వర్యంలో సోమవారం గ్రామ పంచాయతీ కార్యదర్శి మహేష్ గౌడ్‌కు వినతిపత్రం అందజేసినట్లు టీజీవీపీ మండల అధ్యక్షుడు భరత్ రాజ్ తెలిపారు. స్పందించిన కార్యదర్శి త్వరగా వీధి దీపాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు.