ఈతకు వెళ్లి వ్యక్తి మృతి

ఈతకు వెళ్లి వ్యక్తి మృతి

KDP: మైలవరం జలాశయంలో ఈతకు వెళ్లిన వేముల గ్రామానికి చెందిన షేక్ ఇబ్రహీం( 53) మృతి చెందారు. పీర్ గైబుసావలి దర్గా దర్శనానికి కుటుంబంతో వచ్చిన ఆయన తిరుగు ప్రయాణంలో సరదాగా ఈతకు దిగి గల్లంతయారు. సమాచారం అందుకున్న ఎస్సై శ్యామ్ సుందర్ రెడ్డి గజ ఈతగాళ్ల సహాయంతో మృతదేహాన్ని వెలికి తీశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.