INSPIRATION: పింగళి వెంకయ్య
స్వాతంత్ర్య సమరయోధుడు పింగళి వెంకయ్య మన తెలుగువారి గర్వకారణం. కృష్ణా జిల్లాకు చెందిన ఆయన గాంధీజీ ఆశయాలకు అనుగుణంగా త్రివర్ణ పతాకాన్ని రూపొందించారు. కేవలం జెండా రూపకర్తగానే కాకుండా.. సైనికుడిగా, వ్యవసాయ శాస్త్రవేత్తగా, భూగర్భ పరిశోధకుడిగా బహుముఖ ప్రజ్ఞాశాలిగా విలువల కోసం జీవించారు. దేశం కోసం సర్వస్వం ధారపోసిన ఆయన నిరాడంబర జీవితం నేటి యువతకు స్ఫూర్తిదాయకం.