దాతలు సహకారంతో సీసీ కెమెరాలు

RR: కాకునూరు గ్రామ జడ్పీహెచ్ఎస్ పాఠశాల ఆవరణలో దాత గోపని భీమయ్య సహకారంతో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. విద్యార్థుల శ్రేయస్సును కోరి పాఠశాలలో రూ.12 వేల వ్యయంతో సోలార్ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసేందుకు ఆర్థిక సహాయం అందించిన భీమయ్యను గ్రామస్తులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు అభినందించారు.