ఎమ్మెల్యేను పరామర్శించిన ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు

ఎమ్మెల్యేను  పరామర్శించిన ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు

KNR: మానకొండూర్ ఎమ్మెల్యే డా.కవ్వంపల్లి సత్యనారాయణను శుక్రవారం రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పరామర్శించారు. ఇటీవల కవంపల్లి సత్యనారాయణ సోదరుడు, కవ్వంపల్లి రాజేశం మరణించగా మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, సుడా ఛైర్మెన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి పరామర్శించారు. అనంతరం చిత్రపటానికి పూలు వేసి నివాళులు అర్పించారు.