దారుణం.. పసికందును వదిలేసి వెళ్లిన తల్లి

దారుణం.. పసికందును వదిలేసి వెళ్లిన తల్లి

KNR: మాతా శిశు ఆరోగ్య కేంద్రంలోని ఓ తల్లి ఊయలలో ఉన్న తన ఐదు నెలల పాపను వదిలి వెళ్లిపోయిన ఘటన కరీంనగర్‌లో చోటుచేసుకుంది. బిడ్డ అనారోగ్యం, వైద్య నివేదికలు అక్కడే ఉంచింది. ఆ నివేదికల ప్రకారం, ఆ పసిబిడ్డకు మెదడులో సమస్య ఉన్నట్లు తెలుస్తోందని వైద్యులు తెలిపారు. వైద్య సిబ్బంది వెంటనే ఆ పాపను చేరదీసి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు.