పరకామణి చోరీ కేసు.. 30 మందితో విచారణ
తిరుమల పరకామణి చోరీ కేసులో విచారణ మొదలైంది. ఐదు బృందాలుగా అధికారులు ఏర్పడ్డారు. 20 మంది ప్రత్యక్షంగా,10 మంది అధికారులు ఆఫీస్ నుంచి విచారణ కొనసాగించనున్నారు. డీజీ రవిశంకర్ అయ్యన్నార్, ఎస్పీ గంగాధర్, ముగ్గురు డీఎస్పీలు, ఫోరెన్సిక్,సైబర్, ఐటీ విభాగం, లీగల్ విభాగం సభ్యులు విచారణలో పాల్గొంటారు. 28రోజుల్లో విచారణ పూర్తి చేసి హైకోర్టులో నివేదిక సమర్పించనున్నారు.