భూ భారతి చట్టం ద్వారా రైతులకు మేలు: MLA వినోద్

MNCL: జిల్లా వేమనపల్లి మండలంలోని నీల్వాయి గ్రామపంచాయతీ రైతు వేదికలో తెలంగాణ భూ భారతి చట్టంపై మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో MLA గడ్డం వినోద్, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ.. భూ భారతి చట్టం ద్వారా పెండింగ్ సమస్యలు పరిష్కారం జరిగి రైతులకు మేలు జరుగుతుందన్నారు.